Sunday, 31 January 2016

Song - 1 కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పే  
ఏసే  తోడమ్మా

1.  నీకేమి లేదని ఏమి తేలేదని 
అన్నారా నిన్ను అవమానపరిచారా
తల రాత ఇంతేనని తరువాత ఏమవునని
రేపటిని చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా

2. నీకెవరు లేరని  ఏంచేయలేవని
అన్నారా నిన్ను నిరాషాపరిచారా
పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూవున్నావా

నేనున్నానన్న  యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా




                   

No comments:

Post a Comment